పొట్టలో గ్యాస్ రాకుండా పండ్లు

MoovieStars
0
పొట్టలో గ్యాస్ రాకుండా...పండ్లు తినటం

పండ్లలో విటమిన్లు, మినరల్స్, ఇతర ప్రధాన పోషకాలు పుష్కలంగా వుంటాయి. పోషకాలు బాగా వుంటాయి కదా అని రోజులో పండ్లు అధికంగా తింటే, అది అజీర్ణ సమస్యలను కలిగిస్తుంది. కొన్ని పండ్లులో వుండే సార్బిటాల్ అనే షుగర్ మరియు కరిగే పీచులు మీకు గ్యాస్ సమస్య తెస్తాయి. ఇవి త్వరగా జీర్ణం కావు కనుక పేగులలో గ్యాస్ ఏర్పడుతుంది. ప్రస్తుతం మామిడిపండ్ల సీజన్ కొనసాగుతోంది.

మరి మామిడి పండుకూడా అజీర్ణం కలిగిస్తుంది. మామిడిపండుతోపాటుగా ఆపిల్, రేగిపండు, అరటిపండు వంటివి కూడా అజీర్ణం చేస్తాయి. ఈ గ్యాస్ కలిగించే పండ్లను తినేందుకు వాటిని ఏ రకమైన హాని కలగకుండా తేలికగా తినే పద్ధతులు కొన్ని చూద్దాం. మామిడిపండ్లు - తింటే భలే రుచి, ప్రతివారికి ఇష్టమే. కాని ఇది గ్యాస్ కలిగించి పొట్ట ఉబ్బరింపజేస్తుందని తెలుసుకోండి.

షుగర్, పీచు అధికంగా వుండే ఈ పండు త్వరగా రక్తంలోకి తీసుకోబడదు. కనుక అజీర్ణం సమస్యలు వచ్చేస్తాయి. మరి ఈ సమస్య పోవాలంటే, మీరు బాగా మామిడిపండు తినాలంటే ఎలా చూడండి. మామిడిపండు లోని పైభాగం మాత్రమే కోయండి. దానిని పది నుండి పదిహేను నిమిషాలు తినేముందు నీటిలో నానపెట్టండి. ఈ చర్య హానికరమైన గ్యాస్ కలిగించే పదార్ధాలను కరిగిస్తుంది. తర్వాత దానిని తింటే, మంచి రుచి, గ్యాస్ వస్తుందనే భయం లేకుండా తినేయవచ్చు.

ఆపిల్స్ - రోజూ ఒక ఆపిల్ తింటే, రోగాలు దూరం అంటారు. కాని అది కలిగించే గుండె మంట వుంటుంది. ఆపిల్స్ అధికంగా తిన్నా జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. దానిలో పెక్టిన్ రూపంలో పీచు వుంటుంది. పెక్టిన్ ఒక పిండిపదార్ధం. తేలికగా ఇది జీర్ణ వ్యవస్ధలోకి వెళ్ళదు. మరి ఆపిల్ తినాలంటే ఏం చేయాలి? ఆపిల్ పండును నీటిలో బాగా ఉడక పెట్టాలి. ఇక అది మీకు ఏ అజీర్ణ సమస్య కలిగించదు. మీరు అజీర్ణం భావిస్తే ఆపిల్ తప్పక ఉడకపెట్టి తినండి. ఉడకపెట్టినందువలన వీటిలోని పోషకాలు కూడా చెక్కు చెదరక అలానే వుంటాయి. రేగుపండు, జామకాయ - వీటిలో సహజ తీసి వుంటుంది. పెక్టిన్, నీటిలో కరిగే పీచు వుంటాయి. ఇవి కూడా గ్యాస్ కలిగిస్తాయి. త్వరగా జీర్ణం కావు. గ్యాస్ కలిగించే పండ్లను నీటిలో బాగా ఉడికించి తినండి. గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు రాకుండా వుంటాయి. ఈ పండ్లు తినేముందు నీరు బాగా తాగండి. ఇక సమస్యలుండవు.

ఇంత జాగ్రతత్త పడిన తర్వాత కూడా గ్యాస్ ఏర్పడుతూంటే, జీర్ణక్రియకు సంబంధించిన టాబ్లెట్ లు వాడండి. పండ్లను రుచిగా తినండి. కొంతమంది రాత్రివేళ పండ్లు తింటే కూడా గ్యాస్ కలిగిస్తుందని భావిస్తారు. కనుక గ్యాస్ సమస్య లేకుండా వుండాలంటే, హాని కలగని విధంగా, వాటిని సూర్యుడు అస్తమించే లోపుగానే తినేయండి.

ఆరోగ్యాన్ని అద్భుతంగా పండ్లు తింటూ కాపాడుకోండి.

Post a Comment

0Comments
Post a Comment (0)