మగవాళ్ల ముఖ సౌందర్యానికి

MoovieStars
0
రేజర్‌తో షేవింగ్‌ చేసుకోవడం వల్ల ముఖం మంటపుడుతుంది. దీనికితోడు షేవింగ్‌ చేసే క్రమంలో చర్మం కట్‌ అయ్యి మంట తీవ్రత ఇంకా పెరుగుతుంది. ఇలా కాకుండా షేవింగ్‌ ప్రక్రియ సున్నితంగా జరిగేందుకు, చర్మం కాంతివంతంగా కనిపించేందుకు కొన్ని సింపుల్‌ ట్రిక్స్‌ ఉన్నాయి.
క్లెన్సర్‌లు ముఖచర్మం పైన ఉన్న జిడ్డు, దుమ్ముధూళిని పోగొట్టేందుకు మాత్రమే పనికొస్తాయి. చర్మరంధ్రాల లోతుకి వెళ్లి క్లెన్సర్‌లు శుభ్రం చేయలేవు. అలా శుభ్రం చేసుకోవాలంటే ఫేషియల్‌ స్క్రబ్‌ వాడాల్సిందే. మామూలుగా ముఖం కడుక్కుంటే వదలని జిడ్డుని, చెత్తాచెదారాన్ని, మృతకణాలను స్క్రబ్స్‌తో తొలగించుకోవడం తేలిక.
స్క్రబ్‌లో ఉండే గ్రాన్యూల్స్‌ చర్మాన్ని మృదువుగా చేస్తాయి. దుమ్ము, జిడ్డుల్ని లోతుల నుంచి తొలగించడమే కాకుండా షేవింగ్‌ చేసుకునేటప్పుడు వెంట్రుకలు సులభంగా ఊడి వచ్చేలా చేస్తుంది స్క్రబ్‌. దానివల్ల ముఖం మండకుండా, చర్మంపై కోతలు పడకుండా ఉంటుంది. అప్పటివరకు నిర్జీవంగా ఉన్న చర్మం మెరిసిపోతుంది, ఆరోగ్యంగా కనిపిస్తుంది.
ఎక్కువమంది క్లెన్సింగ్‌ కోసం లిక్విడ్‌ లేదా సబ్బులు వాడుతుంటారు. మీరు కూడా అలానే చేస్తుంటే కనుక మాయిశ్చరైజర్‌ అందించే సబ్బులు వాడండి. విటమిన్‌-ఇ, ఆలివ్‌ ఆయిల్‌, జొజొబా ఆయిల్‌ ఉన్నవయితే ఫలితం బాగుంటుంది. ముఖం కడుక్కున్న తరువాత చర్మం బిగుతుగా అనిపించడం లేదా దురద పెట్టడం వంటివి ఉంటే లిక్విడ్‌ క్లెన్సర్‌లు వాడడం బెటర్‌. లేదంటే జెల్‌ అయినా బాగానే పనిచేస్తుంది.
ప్రి-షేవింగ్‌ ఆయిల్‌ రాసుకుని షేవ్‌ చేసుకుంటే వెంట్రుకలు మందంగా ఉన్నా షేవింగ్‌ చేసుకోవడం సులభమవుతుంది. షేవింగ్‌ చేసుకునే కొన్ని నిమిషాల ముందు ఈ ఆయిల్‌ రాసుకోవాలి.
షేవింగ్‌ పూర్తయ్యాక మిగిలిపోయిన షేవింగ్‌ క్రీమ్‌తో ఒకసారి గెడ్డాన్ని తుడిచి నీళ్లు చల్లుకుని తుండుతో తుడవకుండా ఆరనివ్వాలి.
షేవింగ్‌ తరువాత చర్మం మృదువుగా ఉండేందుకు ఆఫ్టర్‌ షేవ్‌ లోషన్‌ రాసుకుని మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. దీనివల్ల ఆఫ్టర్‌ షేవ్‌ లోషన్‌లో ఉండే ఆస్ర్టింజెంట్స్‌ ముఖచర్మాన్ని బిగుతుగా చేస్తుంది.

Post a Comment

0Comments
Post a Comment (0)