చికెన్ కట్ లెట్ తయారుచేయు విధానం

MoovieStars
0
చికెన్ కట్ లెట్ ఒక సులభమైన మరియు రుచికరమైన స్నాక్ రిసిపి. ముఖ్యంగా ఇటువంటి స్నాక్ రిసిపి ఈవెనింగ్ స్నాక్ గా అద్భుతంగా ఉంటుంది. అయితే దీన్ని మీరు వెస్ట్రన్ స్నాక్ గా భావించకండి. వివిధ రకాల ఇండియన్ చికెన్ కట్ లెట్స్ లో ఇది కూడా ఒకటి. 

మన ఇండియన్స్ కు నచ్చిన విధంగా మన ప్లేట్స్ లో రుచికరంగా వండించాలంటే, ఈ కేరళ స్టైల్ చికెన్ కట్ లెట్ రిసిపిని ప్రయత్నించాల్సింది. దీన్ని తయారుచేయడం చాలా సులభం మరియు క్రిస్పీ మరియు స్పైసీగా ఉండే ఈ ఈవెనింగ్ స్నాక్ చికెన్ కట్ లెట్ ను కేరళీయుల స్పెషల్ ఎందుకంటే, చికెన్ ఖీమా మరియు బంగాళదుంపతో తయారుచేస్తారు. ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు జోడించడం వల్ల సౌత్రన్ ఫ్లేవర్ ను అందిస్తూ, ఘుమఘుమలాడుతుంటుంది . మరి ఈ సింపుల్ అండ్ క్రిస్పీ చికెన్ కట్ లెట్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం....




కావల్సిన పదార్థాలు:

ఉడికించిన చికెన్ ఖీమా: ½ kg 
బంగాళదుంపలు: 2(ఉడికించి మెత్తగా చిదిమి పెట్టుకోవాలి) 
పెప్పర్: 1tsp 
గరం మసాలా: 1tsp 
పచ్చిమిర్చి :2 (సన్నగా తరిగిపెట్టుకోవాలి) 
అల్లం: ½ అంగుళం (తురుముకోవాలి) 
గుడ్డు: 1(బీట్ చేసి పెట్టుకోవాలి) 
బ్రెడ్ పొడి: 1cup 
కరివేపాకు: 2-3 రెమ్మలు 
ఉప్పు: రుచికి సరిపడా 
నూనె: 1cup.


తయారుచేయు విధానం : 

1. ముందుగా చికెన్ మరియు ఉడికించి చిదిమి పెట్టుకొన్న బంగాళదుంపలను తీసుకోవాలి. రెండింటిని ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. 

2. తర్వాత అందులో అల్లం, పచ్చిమిర్చి, గరం మసాలా, పెప్పర్ పౌడర్, కరివేపాకు మరియు ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలగలుపుకోవాలి. 

3. తర్వాత అందులోనే మసాలాలను కూడా జోడించి తిరిగి మిక్స్ చేసుకోవాలి. 

4. ఇలా మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకొన్న తర్వాత అందులోను నుండి కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకొని కట్ లెట్ లా ఒత్తుకోవాలి. 

5. తర్వాత డీప్ బాటమ్ పాన్ లో నూనె వేసి బాగా కాగిన తర్వాత, బీట్ చేసిన గుడ్డులో కట్ లెట్ ను డిప్ చేసి తర్వాత బ్రెడ్ పొడిలో అన్ని వైపులా పొర్లించాలి. 

6. ఇప్పుడు ఈ కట్ లెట్స్ ను కాగే నూనెలో వేసి డీఫ్ ఫ్రై చేసుకోవాలి. 

7. దాదాపు 10-15నిముషాలు డీఫ్ ఫ్రై చేసుకోవాలి. 

8. వేగిన తర్వాత వీటిని టిష్యు పేపర్ మీద వేసి నూనె పీల్చుకొన్న తర్వాత , సర్వింగ్ ప్లేట్ లో సర్ధి, సలాడ్ మరియు సాస్ తో సర్వ్ చేయాలి. 

అంతే చికెన్ ఖీమా కట్ లెట్ రెడీ.

Post a Comment

0Comments
Post a Comment (0)