సహజమైన అందం కోసం

MoovieStars
0
చర్మం ఆరోగ్యంగా ఉంటేనే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. రోజు వారి ఆహారంలో తీసుకునే కూరగాయలు, పండ్లతో ముఖవర్చస్సును పొందవచ్చు. అవేంటో తెల్సుకుందాం.

ద్రాక్ష పళ్లను ముఖంపై రుద్దాలి. అరగంట సేపు ఆరనిచ్చాక ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా చేయటంలో ఫేస్‌లో గ్లో వస్తుంది.
బయటకు వెళ్లేటప్పుడు ముఖానికి ఎండ తగలి చర్మం పాడవుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే దోసకాయరసం, గ్లిజరిన్‌, రోజ్‌వాటర్‌ కలిపి మిశ్రమంగా చేసి ముఖానికి రాసుకోవాలి.
కాస్త మంచి గంధం, కొంచెం పసుపు, పాలు కలిపి పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేసుకోవాలి.
పాలమీగడ, తేనె కలిపి ముఖానికి రాస్తే చర్మంలో సాఫ్‌నెస్‌ వస్తుంది.
పాలల్లో కాస్త ఉప్పు చల్లి అందులో నిమ్మరసం వేసి ఫేస్‌కు పూయాలి. ముఖంపై ఉండే డస్ట్‌ పోతుంది.
టమోటారసంతో నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేస్తుంటే కొన్నాళ్లాగాక ముఖంలో గ్లో వస్తుంది.
క్యాబేజ్‌ రసంలో రెండు చుక్కల తేనె వేసి ముఖానికి పట్టిస్తే ముడతలు తొలగిపోతాయి.
క్యారెట్‌ జ్యూస్‌ను ముఖానికి పట్టించుకుంటే సహజమైన కాంతి వస్తుంది.
అలొవిరా జ్యూస్‌ రాస్తే ముఖంపై ఉండే మచ్చలు తొలగిపోతాయి.
 ముల్తాన్‌ మట్టి, నిమ్మఆకుల పౌడర్‌, తులసి ఆకుల పౌడర్‌, రోజ్‌వాటర్‌ మిశ్రమంగా కలిపి ముఖానికి అప్లై చేస్తే చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది. దీంతో పాటు చక్కటి సౌందర్యం వస్తుంది.

Post a Comment

0Comments
Post a Comment (0)