దుర్వాసనను దూరంగా ఉంచేందుకు

MoovieStars
0
నోటి దుర్వాసన వల్ల చాలా రకాల ఇబ్బందులు వస్తాయి. నలుగురిలో ఉన్నప్పుడు ఈ సమస్య వల్ల నోరు విప్పి మాట్లాడలేరు. వైద్య పరిభాషలో హెలిటోసిస్‌ అని పిలిచే ఈ సమస్యకు కారణం నాలుక మీద ఏర్పడే బ్యాక్టీరియా. ఈ సమస్య నుంచి బయటపడాలంటే దంతసంరక్షణతో పాటు ఎప్పటికప్పుడు నోటిని శుభ్రంగా ఉంచాలి. అందుకు కొన్ని సింపుల్‌ టిప్స్‌...


  • నాలుకని శుభ్రం చేసుకోవడం అనేది ముఖ్యమైన అంశం. అలాగే మీ వెంట ఎప్పుడూ టూత్‌బ్రష్‌ కిట్‌ ఉండాల్సిందే. తిన్న వెంటనే ప్రతీసారి నోరు శుభ్రం చేసుకోవాలి. ఇలాచేయడం వల్ల దంతాల మీద ఏర్పడే పాచిని వెంటనే తొలగించేయొచ్చు.
  • టీ, కాఫీ, ఆల్కహాల్‌లకు  నో చెప్పేయాలి. ఎందుకంటే వీటి అవశేషాలు అప్పటికే ఏర్పడిన పాచిమీదకు చేరి జీర్ణవ్యవస్థలోకి చొరబడతాయి. దాంతో మీరు శ్వాసించిన ప్రతిసారీ బ్యాక్టీరియా కొంచెంకొంచెంగా గాల్లోకి విస్తరించి దుర్వాసన వస్తుంది.
  • మంచి మౌత్‌వాష్‌ వాడడం వల్ల ఆహారపదార్థాల వాసన నోటినుంచి తొలిగిపోతుంది. రోజులో మూడునాలుగుసార్లు పుక్కిలించడం వల్ల ఫలితం ఉంటుంది.
  • పాల ఉత్పత్తులు శ్వాస మీద తీవ్రమైన ప్రభావం చూపుతాయి. అందుకని సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండాలి. ఒకవేళ అలాకాని ఉండలేకపోతే వాటిని తిన్న వెంటనే దంతధావనం చేసుకోవడం తప్పనిసరి.
  • నిమ్మరసం, పెరుగు వాడితే దుర్వాసనకు దూరంగా ఉండొచ్చు. అదెలాగంటే నిమ్మరసం బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అలాగే పెరుగులో అధిక మొత్తంలో లాక్టోబాసిల్లస్‌ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది దుర్వాసనకు కారణమైన బ్యాక్టీరియాకి బదులుగా చేరిపోయి దుర్వాసన రాకుండా 24 గంటల పాటు కాపాడగలుగుతుంది. అంటే ప్రతిరోజూ పెరుగు తినాల్సిందేనన్నమాట.

Post a Comment

0Comments
Post a Comment (0)