ఎగ్‌ మసాలా కర్రీ

MoovieStars
0
నోరూరించే బోనాల వంటలు

ఆషాఢ మాసంలో వచ్చే మహాంకాళి బోనాల పండగనాడు అమ్మవారికి బోనాలు సమర్పిస్తాం. ఆ తర్వాత మాంసాహార విందు భోజనాలతో సంబరాలను జరుపుకుంటాం. మరి ఎప్పటిలా కాకుండా ఈసారి సరికొత్త వంటకాలతో బోనాలు జరుపుకుందామా!

ఎగ్‌ మసాలా కర్రీ
కావలసిన పదార్థాలు:
గుడ్డు - 6
ఉల్లిపాయలు - 2
టమాటాలు - 2
పచ్చిమిర్చి - 5
గరం మసాలా - అర టే.స్పూను
అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ - 1 టే.స్పూను
పసుపు - పావు టీ స్పూను
ధనియాల పొడి - 1 టే.స్పూను
తయారీ విధానం:
గుడ్లు ఉడికించి రెండుగా కట్‌ చేయాలి.
బాండ్లీలో నూనె పోసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయించాలి.
వేగాక టమాటా ముక్కలు వేసి వేయించాలి.
తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పసుపు వేయాలి.
నూనె వేరు పడే వరకూ వేయించాలి.
తర్వాత గరం మాసాలా, ధనియాల పొడి, ఉప్పు, వేసి బాగా కలపాలి.
చివరిగా గుడ్లు కలిపి మూత ఉంచి 10 నిమిషాలు ఉడికించాలి.
కొత్తిమీరతో అలంకరించి వేడిగా వడ్డించాలి.



Post a Comment

0Comments
Post a Comment (0)