యంగ్‌గా కనిపించాలంటే

MoovieStars
0
Top 10 Natural Anti Aging Skin Care Tips | Anti Aging skin care tips | Skin care aging anti facial tips | Expert tips for a flawless face | Aging anti care skin | Aging anti care skin treatment | Young Skin

పెద్దవాళ్లమయిపోతున్నామని బాధపడుతున్నారా? వయసు కనపడకుండా... మృదువైన చర్మంతో మెరిసిపోవాలంటే... కింద చెప్పిన ఈ టిప్స్‌ పాటించండి. ఫలితం చూడండి.
  • తీపి పదార్థాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. స్వీట్స్‌ తినకపోతే బరువు తగ్గుతారు. చక్కెర వల్ల కొలాజిన్‌ దెబ్బతింటుంది. డెజర్ట్స్‌ వల్ల కూడా చర్మం ముడతలు పడుతుంది.
  • నిత్యం ముఖాన్ని మసాజ్‌ చేసుకుంటే రక్తప్రసరణ బాగా జరుగుతుంది. చర్మంలో కొలాజిన్‌ ఎక్కువ ఉత్పత్తి కావడం వల్ల అది ఆరోగ్యంగా ఉంటుంది. మృతకణాలను తొలగించడం వల్ల చర్మం మృదువుగా అవుతుంది. దాంతో యంగ్‌లుక్‌ వచ్చేస్తుంది.
  • సాధారణంగా ముఖం, మెడ, చేతుల వంటి భాగాల్లో ఏజింగ్‌ తాలూకా లక్షణాలు బాగా కనిపిస్తాయి. ఈ ప్రాంతాల్లో ఉండే మృతకణాలను తొలగిస్తే చర్మం నిగ నిగలాడుతుంది.
  • తినే పదార్థాలను బట్టి కూడా చర్మం రూపురేఖలు ఉంటాయి. విటమిన్‌-సి బాగా తీసుకుంటే చర్మానికి ఎంతో మంచిది. చర్మంలో కొలాజిన్‌ పెరుగుతుంది. టొమాటోలు, కమలాలు, బ్రొకోలీ, కివి వంటి వాటిల్లో కూడా ఇది బాగా ఉంది. అలాగే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, ఫుడ్స్‌లలో యాంటాక్సిడెంట్లు బాగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఎంతో యంగ్‌గా ఉంచుతాయి. గ్రీన్‌ టీని నిత్యం తాగడం ఎంతో మంచిది. ఇందులో ఉండే యాంటాక్సిడెంట్లు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపేయడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి.
  • పొడిబారిన చర్మం ఉన్నవాళ్లకి చర్మం మీది గీతలు స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్‌ వాడాలి.
  • ఆల్కహాల్‌ అలవాటు వల్ల చర్మం నునుపుదనాన్ని కోల్పోయి చర్మంపై ముడతలు, గీతలు పడతాయి. అంతేకాకుండా చర్మంలోని కొలాజిన్‌ దెబ్బతింటుంది. సన్‌స్ర్కీన్‌ రాసుకోకుండా బయటకు రావడం మంచిది కాదు. సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల వల్ల చర్మం పాడవుతుంది. ఇది చర్మంలోని నునుపుదనాన్ని హరిస్తుంది. నిద్ర బాగా పోతే కూడా చర్మం నిగ నిగలాడుతూ అందం రెట్టింపు అవుతుంది.

Post a Comment

0Comments
Post a Comment (0)