ఆడండి.. చదవండి..

MoovieStars
0
బాలానాం రోదనం బలం అన్నారు పెద్దలు. మరి యుక్తవయసులోకి వచ్చిన యంగ్‌స్టర్స్‌కు ఏది బలం అంటే.. ఆటలని చెబుతున్నారు నిపుణులు. కాలేజ్‌ ఏజ్‌లో ఆటలకు దూరంగా ఉంటే వారి మెదడు చురుకుగా పనిచేయదని
కూడా తీర్మానిస్తున్నారు.

టీనేజ్‌లోకి వచ్చిన తర్వాత పిల్లలు బాగా ఆడేలా ప్రోత్సహించాలని చెబుతున్నారు హెల్త్‌ కౌన్సెలర్లు. ఆడ, మగ అని తేడా లేకుండా రన్నింగ్‌, జంపింగ్‌, కబడ్డీ, వాలీబాల్‌ వంటి ఆటలు ఎక్కువగా ఆడాలని తెలిపారు. బాగా ఆడటం వల్ల శరీరంలోని క్యాలరీలు ఇట్టే కరిగిపోతాయి. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు తొలిగిపోవడంతో.. రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. దీనివల్ల మెదడు కూడా పాదరసంలా చురుకుగా పనిచేస్తుందట.
కాలేజ్‌ క్యాంప్‌సలో కొందరు ఎప్పుడూ పుస్తకాలకే పరిమతమై కనిపిస్తుంటారు. శరీరానికి శ్రమ కలిగించకుండా.. ఎప్పుడూ చదువుతూనే ఉంటే మెదడు తొందరగా అలసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఏళ్లపాటు ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు కలుగుతాయిని హెచ్చరిస్తున్నారు. యంగ్‌ ఏజ్‌లో చదువుకు ఎంత ఇంపార్టెన్స్‌ ఇస్తారో.. శారీరక ఆరోగ్యానికీ అంతే ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్నారు. ఉదయాన్నే జాగింగ్‌ వెళ్లడం, సైక్లింగ్‌, స్విమ్మింగ్‌ చేయడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. సాయంత్రం వేళలో ఓ గంటపాటు ఎంచక్కా ఆడుకోవాలని చెబుతున్నారు. బలవర్ధకమైన ఆహారం తీసుకుంటున్నప్పుడు శరీరానికి ఏ మాత్రం అలసట లేకుండా చూసుకుంటే అసలుకే ఎసరొస్తుందని చెబుతున్నారు. స్నేహితులతో సరదాగా ఆడటం వల్ల శారీరక శ్రమతో పాటు బోన్‌సగా మానసిక ఆనందం కూడా కలుగుతుంది. దీంతో మీ చదువు కూడా సాఫీగా సాగుతుంది. అందుకే ఆడండి.. చదవండి.

Post a Comment

0Comments
Post a Comment (0)